వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమస్యల వలయం: ఊరట కోసం ఫ్లైటెక్కనున్న కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన అధిష్టానంతో చర్చించనున్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పలు సమస్యలను ఓ కొలిక్కి తెచ్చేందుకు కిరణ్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కళంకిత మంత్రుల వ్యవహారం చర్చించే అవకాశముంది.

అలాగే పార్టీని వీడుతామని ప్రకటించిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల వ్యవహారం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం విమర్శలు, కర్నాటక ఎన్నికల విజయం ఏ మేరకు, ఎలా ఎపి రాజకీయాలపై పడుతుందనే తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్నాటక ఎన్నికలు పూర్తవగానే ఆయన ఢిల్లీ వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే, కేంద్రంలోని పరిస్థితుల దృష్ట్యా కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడి ఈరోజు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇది సొంత పార్టీ నేతల నుండే విమర్శలకు తావిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావులను మంత్రివర్గం నుండి తొలగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై అధిష్టానంతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు కిరణ్ ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు అసంతృప్తి వర్గం వరుస భేటీలను ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. బొత్స సత్యనారాయణ జోడు పదవుల అంశం కూడా కిరణ్ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్ తమ ముందుకు తెచ్చే సమస్యలను తక్షణమే అధిష్టానం పరిష్కరించి ఆయనకు ఊరటనిస్తూందా అనేది తేలిపోనుంది.

English summary
Chief Minister Kiran Kumar Reddy will go new Delhi on Wednesday evening to meet Congress Party High Command leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X