వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకది సరిపోదు: రాయపాటి, సత్తా ఉండాలి: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao - DL Ravindra Reddy
గుంటూరు/కర్నూలు: కళంకిత మంత్రుల పైన తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు బుధవారం అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన మంత్రులను కేంద్రం వెంటనే తొలగించిందని గుర్తు చేశారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులపై అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేస్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రమంత్రి పదవి వస్తుందని తాను ఆశించడం లేదని, సహాయ మంత్రి పదవి తనలాంటి సీనియర్లకు సరిపోదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడం ద్వారా 2014 ఎన్నికల్లో టిడిపి మూడోసారి గెలిపిస్తుందన్నారు.

సత్తా ఉండాలి: డిఎల్

పథకాలు ఎన్ని ఉన్నా వాటిని అమలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కర్నూలు జిల్లాలో వ్యాఖ్యానించారు. కళంకిత మంత్రుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుంనద్నారు. కర్నాటక పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకోవాలని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమలు చేసిన భీమా పథకంలో రూ.200 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.

తెలంగాణవాదం ఉంది: పొన్నాల

ప్రజల్లో తెలంగాణవాదం ఉందని అన్ని పార్టీలు భావిస్తున్నాయని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణకు కాంగ్రెసు సానుకూలమన్నారు. కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితో తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. కడియం చేరితోనే తెలంగాణ వస్తుందంటే ఇన్నాళ్లు కెసిఆర్ నిస్సహాయస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao has responded on cabinet post on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X