వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్: ఇద్దరు ఎపి పోలీస్‌లపై ఛార్జీషీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Andhra Pradesh
ముంబై: సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో రాజస్థాన్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాను నిందితునిగా పేర్కొంటూ సిబిఐ మంగళవారం ప్రత్యేక కోర్టులో అదనపు చార్జిషీటును సమర్పించింది.

కటారియాతో పాటు ఆర్కె మార్బుల్ సంస్థ డైరెక్టర్ విమల్ పాట్నీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసింహ బాలసుబ్రహ్మణ్యం, మరో పోలీసు అధికారి జి.శ్రీనివాసరావులను కూడా నిందితులుగా చేర్చింది. హైదరాబాద్ నుంచి సోహ్రాబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బీలను గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు కిడ్నాప్ చేసి ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపేందుకు మన రాష్ట్ర పోలీసులు సహకరించారని సిబిఐ తన చార్జిషీటులో ఆరోపించింది.

సోహ్రాబుద్దీన్ చిన్నపాటి నేరస్తుడని, విమల్ పాట్నీ అనే వ్యాపారి నుంచి రూ.24 కోట్లు డిమాండ్ చేశారని సిబిఐ తెలిపింది. పాట్నీ, గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షాల మధ్య కటారియా సంధానకర్తగా పనిచేశారని సిబిఐ ఆరోపించింది. సోహ్రాబుద్దీన్, ఆయన భార్యను హత్యచేయించడంలో షా ప్రధానపాత్ర పోషించారని తెలిపారు.

ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడని పేర్కొంది. కటారియా, పాట్నీలతో పాటు జూన్ 4న కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు రాష్ట్ర పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. వీరిపై హత్య, అక్రమ నిర్బంధం, కిడ్నాప్ తదితర నేరాల కింద్ సిబిఐ అభియోగాలు మోపింది.

English summary
Senior BJP leader Gulab Chand Kataria has been booked by the CBI on murder charges in the Sohrabuddin Sheikh fake encounter case. Apart from Kataria, the second politician to be booked in the case, three others were also booked — Andhra Pradesh IGP (intelligence) N. Balasubramanyam, R.K. Marble director Vimal Patni and another AP police officer, G. Srinivasa Rao — under sections related to murder, kidnapping, wrongful confinement and causing disappearance of evidence, among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X