రాజయ్యకు కెసిఆర్ షాక్: కడియంకు వరంగల్ లోకసభ?

ప్రస్తుతం వరంగల్‌కు కాంగ్రెసు పార్టీ నేత రాజయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పలువురు కాంగ్రెసు ఎంపీలు తెరాసలో చేరుతారనే ప్రచారం ఇటీవలి వరకు జరిగింది. అందులో రాజయ్య పేరు కూడా ఉంది. అయితే, రాజయ్య తన చేరాలంటే తనకు ఎంపీ టిక్కెట్‌తో పాటు తన తనయుడికి మానకొండూరు టిక్కెట్ ఇవ్వాలని కెసిఆర్‌ను కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కెసిఆర్ నుండి హామీ రాకపోవడంతో రాజయ్య చేరికపై వెనక్కి తగ్గారట.
ఇప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి చేరడంతో ఆయనకు వరంగల్ పార్లమెంటు టిక్కెట్ ఇస్తానని కెసిఆర్.... రాజయ్యకు షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు రాజయ్య చేరినా ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. కడియం కంటే ముందే రాజయ్య చేరి ఉంటే ఆయనకు వరంగల్ టిక్కెట్ పైన హామీ దక్కేదని, ఇప్పుడు కడియం చేరికతో రాజయ్యకు ఆ అవకాశం లేకుండా పోయిందంటున్నారు.
స్టేషన్ ఘనపూర్ నుండి ఇదివరకు ప్రాతినిథ్యం వహించిన కడియం శ్రీహరి ఇప్పుడు అక్కడి నుండి పోటీ చేసేందుకు అవకాశం లేదనే చెప్పవచ్చు. ఆయన కంటే ముందే కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తెరాసలో చేరిన రాజయ్య బరిలో ఉన్నారు. ఆయన 2009లో కడియం పైన గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెరాసలో చేరారు. దీంతో 2014లో స్టేషన్ ఘనపూర్ రాజయ్యకే దక్కనుంది. అదే నియోజకవర్గానికి చెందిన కడియం వరంగల్ ఎంపీ టిక్కెట్ హామీతోనే వచ్చినట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications