బాలయ్యతో బాబు భేటీ రాజకీయం కాదు: టిడిపి

పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్న నందమూరి హరికృష్ణను కూల్ చేసే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికలు పార్టీకి అసలైన పరీక్ష అయిన నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించిన చంద్రబాబు రాయబారం కోసం బాలయ్య వద్దకు వెళ్లినట్లుగా ఊహాగానాలు చేలరేగాయి.
హరికృష్ణ వద్దకు బాలయ్యను రాయబారిగా పంపి ఆయనను చల్లబర్చారని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆయన అలక వీడితే పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని బాబు భావిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు, బాలయ్యల భేటీ వెనుక రాజకీయ కారణాలు లేవని, హరికృష్ణ అలక గురించి అసలే కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పది రోజుల క్రితం బాలకృష్ణ కుటుంబ సభ్యులు చంద్రబాబు ఇంటికి మర్యాద పూర్వకంగా వచ్చారని, ఇప్పుడు బాబు కుటుంబ సభ్యులు నందమూరి హీరో ఇంటికి వెళ్లారని కూడా అన్నారు.
ఇదిలావుంటే, చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనకాపల్లికి చెందిన దాడి వీరభద్రరావు పార్టీని వీడిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. దాడి వీరభద్రరావు వీడినా తాము పార్టీతోనే ఉంటామని అనకాపల్లి కార్యకర్తలు చెప్పారు.












Click it and Unblock the Notifications
