మన్మోహన్‌కు నగదు, భూమి లేదు: మారుతి ఉంది

Manmohan Singh
గౌహతి: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పిడికెడు భూమి కూడా లేదు. వ్యవసాయ భూమి గానీ వ్యవసాయేతర భూమి గానీ లేదు. అయితే 1996 మోడల్ మారుతి 800 కారు మాత్రం ఉంది. చరాస్తులు ఉన్నాయి. రూ. 3.87 కోట్ల మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేవు.

ఆయనకు రెండు నివేశన ఆస్తులున్నాయి. ఆస్సాం నుంచి ఐదో సారి రాజ్యసభకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ఆయన తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను జత చేశారు. 2011 -12 ఆర్థిక సంవత్సరానికి గాను దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్స్ ప్రకారం మన్మోహన్ సింగ్‌కు రూ. 40,51,964 మేర ఆదాయం ఉంది.

ప్రధాని చరాస్తుల విలువ రూ. 3,87,63,188 కాగా, భార్య గురుశరన్ కౌర్ చరాస్తుల విలువ రూ. 20,27,902. మన్మోహన్ సింగ్ చరాస్తుల్లో 12 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. వాటిలో 11 న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సెక్రటేరియట్ శాఖలో ఉన్నాయి. ఒకటి గౌహతిలోని డిస్పూర్ శాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంది. న్యూఢిల్లీలోని జిపివోలో జాతీయ పొదుపు పథకం కింద రూ.8,26,922 పెట్టుబడి పెట్టారు.

ప్రధాని సతీమణి చేతిలో రూ. 20 వేల నగదు ఉంది. మన్మోహన్ సింగ్ కారు ప్రస్తుత ధర రూ. 21,033. స్థిరాస్తుల్లో చండీఘర్‌లో రెండంతస్థుల భవనం ఉంది. న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఆపార్టుమెంట్ ఉంది. ప్రధాని సతీమణికి నివేశన లేదా వాణిజ్య ఆస్తులు ఏవీ లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+