లొంగిపోయిన సంజయ్: ఏడ్చేసిన మాన్యత, ప్రియాదత్

Sanjay Dutt
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం మధ్యాహ్నం టాడా కోర్టు ఎదుట లొంగిపోయారు. అంతకు ముందు సంజయ్ దత్ తన ఇంటి నుండి కోర్టులో లొంగిపోయేందుకు బయలుదేరారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కోర్టుకు వచ్చారు. ఆయన వెంట భారీగా అభిమానులు తరలి వచ్చారు. కోర్టుకు బయలుదేరినప్పుడు నివాసం వద్ద ఆయన వాహనం చుట్టూ జనం గుమికూడారు. తెల్ల కుర్తా, జీన్స్ ధరించారు. వాహం కదలడం కూడా కష్టమైంది. కోర్టు వరకు సంజయ్ దత్‌ను అనుసరించిన సోదరి ప్రియాదత్, భార్య మాన్యత ఏడ్చేశారు.

సంజయ్ దత్ లొంగుబాటు నేపథ్యంలో టాడా కోర్టు వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సంజయ్ ఇంటి నుండి కోర్టు వరకు కూడా బలగాలను మోహరించారు. 1993 నాటి పేలుళ్ల కేసులో గతంలోనే పదిహారు నెలల శిక్ష అనుభవించిన సంజయ్ దత్ మరో మూడున్నరేళ్లు జైలులో ఉండనున్నారు.

గతంలో టాడా కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించగా.. పై కోర్టులో ఏడాది ఊరట లభించింది. శిక్షను ఏదేళ్లకు తగ్గించింది. దీంతో మరో మూడున్నరేళ్లు సంజయ్ దత్ ఎరవాడ జైలులో ఉండనున్నారు. సంజయ్ దత్ జైలుకు వెళ్తున్నందున ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. అభిమానులది అదే పరిస్థితి.

కాగా, పుణేలోని ఎరవాడ జైలులో లొంగిపోతానని సంజయ్ దత్ మొదట దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తన దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి టాడా కోర్టు బుధనవారం సంజయ్ దత్‌కు అనుమతి ఇచ్చింది. తనకు స్వార్థ శక్తుల నుంచి, ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు ఉందని చెబుతూ ఎరవాడ జైలులో లొంగిపోవడానికి అనుమతి ఇవ్వాలని టాడా కోర్టును కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+