తప్పుచేశా: బోరుమన్న అంకిత్, ఫిక్సింగ్‌లో 'బుకీ' ట్విస్ట్

తప్పును అంగీకరించిన అంకిత్
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అంకిత్ చవాన్ ఢిల్లీ పోలీసుల ముందు తన తప్పును అంగీకరించాడు. బుకీలతో పాటు శ్రీశాంత్, అంకిత్, చండిలాలను కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించింది. అంకిత్ తన విచారణలో బోరున విలపించినట్లుగా తెలుస్తోంది. తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని అంగీకరించాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా.. బుకీల ఒత్తిడి వల్లే ఒప్పుకున్నట్లు అతను చెప్పాడు.
ఫిక్సింగ్‌కు పాల్పడటం వల్ల క్రికెట్ కెరీర్ చెడగొట్టుకున్నావని పోలీసులు చెప్పినప్పుడు అంకిత్ చవాన్ కన్నీళ్ల పర్యంతమయ్యాడట. అజిత్ చండిలానే ఇతనిని స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడేలా చేశాడని పోలీసులు చెప్పారు. అంకిత్ తన తప్పును ఒప్పుకోగా.. అతని సోదరుడు నిహార్ చవాన్ మాత్రం తన సోదరుడిని కావాలనే ఇరికించారని ఆరోపిస్తున్నాడు.
బెయిల్ పిటిషన్ వేయనున్న శ్రీశాంత్!
తాను ఏ తప్పు చేయలేదని, ఎప్పుడు బుకీలతో మాట్లాడలేదని శ్రీశాంత్ తనతో చెప్పాడని అతని న్యాయవాది దీపక్ ప్రకాశ్ మీడియాతో చెప్పారు. శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని ఎవరి నుండి డబ్బులు తీసుకోలేదని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరితోను తనకు సంబంధం లేదని శ్రీశాంత్ చెప్పినట్లు లాయర్ చెప్పారు. తాము శనివారం బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.
19న సమావేశం కానున్న బిసిసిఐ
స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో బిసిసిఐ ఈ నెల 19న చెన్నైలు సమావేశం కానుంది. ఫిక్సింగ్ విమర్శలపై చర్చించనున్నారు. కాగా, ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశంలో రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అమిత్ సింగ్‌ను బిసిసిఐ సస్పెండ్ చేసింది. ఫిక్సింగ్ వ్యవహారంలో క్రికెట్ బుకీగా వ్యవహరించాడనే ఆరోపణలు రావడంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications