ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు కోర్టు సమన్లు జారీ

తమ సంస్థలోకి రూ. 800 కోట్లు అక్రమంగా విదేశాల నుంచి నిధులు వచ్చాయని, దీనిపై ఈడీ విచారణ జరుపుతోందంటూ గత ఏప్రిల్ 2న ‘ఆంధ్రజ్యోతి' తప్పుడు కథనం ప్రచురించిందని ఆరోపిస్తూ ఇండ్ భారత్ ఎనర్జీస్ డీజీఎం బీవీఎస్ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శుక్రవారం విచారించి పిటిషనర్, సాక్షి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 34, 384, 506 రెడ్‌విత్ 120(బి)ల కింద రాధాకృష్ణతోపాటు సంపాదకుడు శ్రీనివాస్, ఆమోద పబ్లికేషన్స్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరారు.
ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. రాధాకృష్ణతోపాటు శ్రీనివాస్, ఆమోద పబ్లికేషన్స్ ప్రతినిధికి సమన్లు జారీ చేశారు.












Click it and Unblock the Notifications