ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీని రానిస్తే..!: విజయమ్మ రాకపై తెరాస టెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
అదిలాబాద్/కరీంనగర్: ఈ నెల 21వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కాగజ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ముందే జిల్లాలో వేడి రాజుకుంది. స్థానిక తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పిన తర్వాతనే విజయమ్మ కాగజ్‌నగర్‌లో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పడం కాకుండా స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ జిల్లాల్లోని గ్రామాలు, నగరాలకు వస్తే ఆ ప్రభావం తమ పార్టీపై పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు భావిస్తున్నారట. అందుకే విజయమ్మ పర్యటన అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారట. తమ పార్టీపై ప్రభావం పడకుండా ఉండాలంటే జగన్ పార్టీని తెలంగాణలోకి మరింత చొచ్చుకు రానివ్వవద్దని తెరాస భావిస్తోందట. అందులో భాగంగానే తెలంగాణపై స్పష్టత ఇవ్వకుంటే విజయమ్మను రానిచ్చేది లేదని తెరాస స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారట.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోనేరు కోనప్ప పార్టీ గౌరవాధ్యక్షురాలు సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, విజయమ్మ ఆదివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.

English summary
YSR Congress party honorary president YS Vijayamma's visit to Kagaznagar town scheduled for may 21 is creating tense situation in the area as TRS leaders are threatening to obstruct her programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X