బెజవాడ నాదేనని నాని: ఫోన్ కబుర్లపై నామా ఆవేదన

విజయవాడ పార్లమెంటు టిక్కెట్ నాదే: కేశినేని నాని
కృష్ణా జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో ఈ రోజు మినీ మహానాడు జరిగింది. జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని మాట్లాడుతూ... విజయవాడ పార్లమెంటు టిక్కెట్ తనదేనని చెప్పారు. ఈ విషయాన్ని ఇంతకుముందే చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లాలో విభేదాలు
ఖమ్మం జిల్లా మినీ మహానాడులో పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు, పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమంలో నామా మాట్లాడుతున్నసమయంలో తుమ్మల, బాలసాలు ఫోన్‌లో కబుర్లు పెట్టారు. దీంతో నామా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తనను కలుపుకొని పోవడం లేదని నామా ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications