వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతలని దులిపిన కార్యకర్త: బొత్సను తప్పుపట్టిన విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha rao and Botsa Satyanarayana
హైదరాబాద్: రాష్ట్రంలో చాలామంది కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారని, వారిని పట్టించుకోవాలని ఆ పార్టీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. బుధవారం కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ప్రకాశం జిల్లా నుండి వచ్చిన ఓ నేత ఘాటుగానే మాట్లాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడే పార్టీ నేతలకు కార్యకర్తలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం తాము జైళ్లకు వెళ్తున్నామని, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు.

కార్యకర్తలు ముష్టివాళ్లలా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాలలోని పరిస్థితి మీకు తెలియదన్నారు. తప్పుడు నివేదికలు వస్తున్నాయని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకే విలువిస్తారా, కార్యకర్తలకు లేదా అని ప్రశ్నించారు. ఆయన ఘాటు వ్యాఖ్యలతో పెద్దలు అవాక్కయ్యారు. కృష్ణా జిల్లా నుండి వచ్చిన మరో నేత కూడా ఇలాగే మాట్లాడే ప్రయత్నాలు చేయగా మైక్ కట్ చేశారు. విమర్శలు వద్దని బొత్స సర్ది చెప్పారు.

త్వరలో స్థానిక ఎన్నికలు: జానా

ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం అమలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. జూన్, ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

బొత్స వ్యాఖ్యలపై విహెచ్ అసంతృప్తి

పార్టీ నుండి వెళ్లే వాళ్లు వెళ్తారని, వాళ్లను ఆపలేమన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెళ్లేవారు వెళ్తారనడం సరికాదని అలా అంటే వెళ్లమన్నట్లే అన్నారు. వెళ్లే వారిని ఆపే ప్రయత్నాలు చేయాలన్నారు.

English summary

 One Congress Party activist has blamed party senior leaders that they are not caring about party activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X