ఖాకీ వర్సెస్ ఖాకీ: కొట్టుకుని, కెమెరాకు చిక్కారు

Police
లక్నో: పోలీసులు లాఠీచార్జీ చేయడం, లాఠీలు ఝళిపించడం సర్వసాధారణం. కానీ, ఇరువురు పోలీసులు ఒకరినొకరు లాఠీలతో కొట్టుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు జవాన్లు కూడా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భద్రతా విభాగానికి సంబంధిచినవారు కావడం విశేషం.

ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న పిఎసి (ప్రొవిన్షియల్ సాయుధ కానిస్టబులరీ)కి చెందిన ఇద్దరు జవాన్లు పరస్పరం లాఠీలతో కొట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఓ సభలో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన గోమతినగర్‌లో చోటు చేసుకుంది.

జవాన్ల మధ్య ఘర్షణకు కారణమేమిటనేది తెలియదు. శాంతిభద్రతల విషయంలో ఉత్తరప్రదేశ్‌కు ఘనచరిత్ర ఉంది. ఈ సంఘటన దానికి మరింతగా తోడవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఓ జవానుకు తీవ్రంగా గాయాలై నెత్తురు కారింది.

ఇద్దరు కానిస్టేబుళ్లు కూడాీ ముఖ్యమంత్రికి అదనపు భద్రతను కల్పిచే పిఎసి పదో బెటాలియన్‌కు చెందినవారు. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ ముకుల్ చంద్ర యావద్, కానిస్టేబుల్ సునీల్ దీక్షిత్ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+