IPL 2026: బుమ్రా కొనసాగింపుపై తేల్చేసిన పొల్లార్డ్..! నెక్ట్స్ మ్యాచ్ ల్లో..!
ఐపీఎల్ 2026 (IPL 2026)లో స్వదేశీ ఆటగాళ్లంతా దుమ్మురేపుతున్నారు. విదేశీ ఆటగాళ్లతో పోటీ పడి మరీ పరుగులు, వికెట్లు సాధిస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లయిన సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) వంటి వారు మాత్రం వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు. అదీ టీ20 వరల్డ్ కప్ గెలిపించి వచ్చి ఐపీఎల్ ఆడుతున్న వీరి ప్రదర్శన స్వదేశంలో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా వరుస వైఫల్యాలపై కోచ్ కైరన్ పొల్లార్డ్ (kieron pollard) స్పందించాడు.
తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 54 పరుగులు ఇవ్వడమే కాకుండా వికెట్ కూడా తీయకుండా స్పెల్ ముగించాడు. ఈ నేపథ్యంలో మరోసారి విమర్శలకు బుమ్రాను టార్గెట్ చేసారు. బుమ్రా ఇంత పేలవంగా ఆడుతున్నా అతన్ని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారనే చర్చ మరోసారి జోరందుకుంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు కోచ్ కైరన్ పొల్లార్డ్ అండగా నిలిచాడు. బుమ్రాకు ఒక చెడ్డ రోజు ఉండే అర్హత ఉందని, అలాగే ఒక చెడ్డ సీజన్ కొనసాగించడానికి కూడా అర్హత ఉందని తేల్చేశాడు.

IPL 2026 Playoffs Race: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఎవరెక్కడ ? టాప్ 4 బెర్తుల పోటీలో..!
పొలార్డ్ వ్యూహాత్మక విశ్లేషణకు అతీతంగా బుమ్రాకు విఫలమయ్యే హక్కు ఉందని సమర్థించడం విశేషం. ఒక క్రికెటర్ మళ్లీ సరిగ్గా ఆడనప్పుడు, అతను ఎందుకు సరిగ్గా ఆడటం లేదో ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని, జస్ప్రీత్ బుమ్రా విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నాడు. అతను చాలా సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాడన్నాడు. ఒక మనిషిగా, తప్పులు చేయడానికి, ఒక రోజు బాగా ఆడకపోవడానికి, ఒక సీజన్ సరిగ్గా సాగకపోవడానికి, లేదా కొన్ని నెలలు సరిగ్గా గడవకపోవడానికి అతనికి కూడా హక్కు ఉందన్నాడు. అతను చేసిన మంచి ప్రదర్శనలను కూడా మనం అప్పుడప్పుడు గుర్తుంచుకోవాలని భావిస్తున్నట్లు పొల్లార్డ్ తెలిపాడు.













Click it and Unblock the Notifications