500 తీసుకొని ఓటేస్తే ఇలాగే ఉంటుంది: రాయపాటి

Rayapati Sambasiva Rao
గుంటూరు/వరంగల్: మార్పు అనేది రాజకీయ నాయకులలో కాదని మొదట ప్రజలలో రావాలని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆయన గురువారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. రూ.500 తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తే రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మార్పు అనేది నాయకులలో రాదని, ప్రజల నుండే మార్పు రావాలన్నారు. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానుకోవాలని అభిప్రాయపడ్డారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలిగించేవేనని చెప్పారు. కర్నాటకలో భారతీయ జనతా పార్టీ అవినీతి కారణంగానే ఓడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు కళంకిత నాయకులను తిరస్కరించాలని ఆయన కోరారు.

జూన్ 3న బిజెపిలోకి నాగం

జూన్ 3వ తేదీన తెలంగాణ నగారా సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తానని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. 2014లో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బిజెపి తెలంగాణను ప్రకటిస్తుందని చెప్పారు. జూన్ 3వ తేదిన తెలంగాణ నగారా సమితిని బిజెపిలో విలీనం చేసినప్పుడే తాను ఆ పార్టీలో చేరుతానని అన్నారు. తాను వచ్చే ఎన్నికలలో పాలమూరు నుండి బిజెపి తరఫున లోకసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+