అమ్మ మెతక, నేను చాలా కఠినం: రాహుల్ గాంధీ

Rahul Gandhi and Sonia Gandhi
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షురాలు, అమ్మ సోనియా గాంధీ కాస్త మెతగ్గా వ్యవహరిస్తారని, కానీ, తాను మాత్రం కఠినంగా ఉంటానని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ నాయకులను హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యంపై, ముఠాల పోరుపై తాను కఠినంగా వ్యవహరిస్తానని ఆయన పార్టీ నాయకులకు చెప్పారు.

మరో నెలరోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరూ కలిసి కట్టుగా శ్రమించి, సమన్వయంతో పనిచేసి నాలుగోసారి పార్టీకి ఢిల్లీలో అధికారం కట్టబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా పార్టీ నేతల క్రమశిక్షణ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెతగ్గా వ్యవహరించారని, తాను మాత్రం అలాంటి వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించనని నేతలను హెచ్చరించారు.

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని కూడా ఆయన ఆశించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు, పార్టీ అధ్యక్షుడు జెపి అగర్వాల్‌కు మధ్య నెలకొన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+