కెసిఆర్ ఓ లంగ, ఓటు మాకు ఉచ్చ నీకు: మోత్కుపల్లి

mothkupalli narasimhulu
హైదరాబాద్: తెలంగాణవాదులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నోట్లో ఉచ్చ పోసే రోజులు దగ్గర్లో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కెసిఆర్ పైన నిప్పులు చెరిగారు.

మోత్కుపల్లి మాట్లాడుతూ.. కెసిఆర్ ఓ దొంగ, లంగ అన్నారు. కింగ్ ఆఫ్ చీటర్స్ అండ్ రాబరర్స్ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని బలిశారని, నోటీకి తాళం పడకపోతే భరతం పడతామన్నారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ ఇస్తే అభినందించ మనసులేని దొంగ అన్నారు. తనను బెదిరించినట్లుగా సాక్ష్యాలు చూపించేందుకు సిద్ధమన్నారు. చందాల పార్టీగా మారిందని, ప్రజలను పీక్కతింటున్నారన్నారు. కడియం శ్రీహరి పైన కూడా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

ఓట్లు మాకు వేసి ఉచ్చ నీకు పోస్తారని, దానిని పట్టుకొని ఉంచుకొంటే ఫాంహౌస్‌లో మందు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సోడా తక్కువైతే కలుపుకోవడానికి పనికొస్తుందని, లేకపోతే ఫాంహౌస్‌లో మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చునని, అవైనా బాగా పెరుగుతాయని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి గురించి కెసిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అదే ఎర్రబెల్లి నాయకత్వంలో తెలంగాణలోని టిడిపి కార్యకర్తలంతా కలిసి కెసిఆర్ మాట్లాడుతున్న దానిని పోస్తే ఆయన, ఆ పార్టీ నేతలు అందులో కొట్టుకుపోయి ఊపిరాడక చస్తారని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.

తాము కూడా కెసిఆర్‌లాగా మాట్లాడగలమని, తమకు అంత కంటే ఎక్కువే వచ్చునని కానీ, సభ్యత అడ్డం వచ్చి మాట్లాడలేకపోతున్నామని, కెసిఆర్ మాటలు చూసి తెలంగాణలో అందరూ ఇలాగే మాట్లాడతారని ఇతర ప్రాంతాల వారు అనుకొనే ప్రమాదముందన్నారు. ఆయన మాటలకు తమ తెలంగాణ సంస్కృతికి సంబంధం లేదన్నారు. బుడ్డిపేట నుంచి వలస వచ్చిన కెసిఆర్ తనతోపాటు ఈ అవలక్షణాలను మోసుకొని వచ్చాడన్నారు.

తెలంగాణ సమాజానికి, సంస్కృతికి ఆయన అవలక్షణాలను పులమొద్దన్నారు. ఎండ దెబ్బకు కెసిఆర్‌కు మతి భ్రమించిందని, అందుకే నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై మహానాడులో టిడిపి తీర్మానం చేస్తుందా అని ప్రశ్నిస్తున్న కెసిఆర్.. అదే ప్రశ్నను కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెయ్యి మంది తమ ప్రాణాలు అర్పిస్తే వాటిని వంద అసెంబ్లీ సీట్ల కోసం వాడుకోవడానికి కేసీఆర్ తపిస్తున్నారని విమర్శించారు.

నీ బొంద మీద వంద అసెంబ్లీ సీట్లు పెట్టినా వాటిని చివరకు సోనియా గాంధీకి అమ్ముకొనే వాడివేనని, రఘునందన్, చాడా సురేష్ రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య వంటి వారంతా నీ అసలు రంగు బయట పెడుతున్నారన్నారు. ఉస్మానియా జెఏసిలో పని చేసిన విద్యార్థి నేతలకు నీ రంగు తెలిసిపోయి టీడీపీలోకి వస్తుంటే చెమటలు పడుతున్నాయన్నారు. తెరాసకు వంద సీట్లు వచ్చినా ఒరిగేది శూన్యమన్నారు.

కెసిఆర్ భాష మార్చుకోవాలని, లేకపోతే జనం ఉచ్చ చేతుల్లో కాదు.. నోట్లో పోస్తరని వరంగల్ జిల్లా టిడిపి అధ్యక్షుడు ఎఢబోయిన బస్వారెడ్డి హెచ్చరించారు. కెసిఆర్ వెంటనే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బాన్సువాడ టిడిపి ఇన్‌చార్జీ బద్యానాయక్ డిమాండ్ చేశారు. కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే మలమూత్రాలతో ఆయన నోటిని శుభ్రం చేస్తామని నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి మండిపడ్డారు.

కెసిఆర్ వెయ్యి మందిని బలి తీసుకుని వేలాది కోట్లను దోచుకున్నారని ఎంపి నాగా నాగేశ్వర రావు విమర్శించారు. చంద్రబాబు పేరు తలిస్తేనే కెసిఆర్‌కు ఉచ్చ పడుతుందని దయాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. టిడిపికి వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేకే మతిభ్రమించినట్లు కెసిఆర్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాథోడ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+