క్రూరత్వం: మహేంద్రకర్మ శవంపై పొడిచి డ్యాన్స్ చేశారు

ఆ సమయంలో మహేంద్ర కర్మ తనను మాత్రమే కాల్చి చంపండని, మిగిలిన వారిని వదిలి వేయాలని చెప్పారు. అనంతరం అతని కాల్చారు. కాలితో తన్నారు. చనిపోయిన మహేంద్ర కర్మ శరీరంపై కసికొద్ది కత్తితో పొడిచారట. అనంతరం ఆయన శరీరంపై ఆనందంతో డ్యాన్స్ చేశారట. తనను మాత్రమే కాల్చాలన్న మహేంద్ర కర్మ అభ్యర్థనను వినిపించుకోకుండా మిగతా వారిని చంపారు.
ఆంధ్రా మావోయిస్టుల పనేనా?
ఛత్తీస్‌గఢ్ మారణ హోమం ఆంధ్రప్రదేశ్ మావోయిస్యుల వ్యూహరచనగా భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రముఖ ఆంధ్రా మావోయిస్టులే నాయకత్వం వహిస్తున్నారు. అటాక్ సమయంలో పలువురు మావోయిస్టులు తెలుగులో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలుగు వారే దీనికి వ్యూహరచన చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications