కోదండరామ్‌కు ఉరి, జగన్‌కు పిండం: ఆనం వివేకా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అక్రమాలు చేసి జైలుకు వెళ్తే కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. సంవత్సరీకం పేరుతో వైయస్సార్ కంగ్రెసు పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తారా అని ఆయన అడిగారు. ప్రజల సొమ్మును దోచుకున్న నేత జైలులో ఉంటే కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం సరి కాదని ఆయన అన్నారు. నీ కుమారుడు జైల్లో ఉంటేనే బాగుంటారని, బయటకు వస్తే మీ పార్టీ నేతలే పిండం పెడతారని ఆయన విజయమ్మను ఉద్దేశించి అన్నారు.
ఇదిలావుంటే, బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కేనని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ జెఎసి చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బయ్యారం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎలా తరలిస్తారో తాము చూస్తామని ఆయన అన్నారు.
తెలంగాణలో నక్సలైట్లపై సీమాంధ్ర నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. నక్సల్స్ తెలంగాణలోనే కాదు, కోస్తాంధ్రలోనూ ఉన్నారని ఆయన అన్నారు. అలాంటప్పుడు కోస్తాంధ్రను మద్రాసులో కలుపుతారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications