లోకేష్ కోసం ఎన్టీఆర్‌కు చేయి: పొంగులేటి, ఆనం ఫైర్

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును కాచి వడబోశారని, చంద్రబాబుకు ఓటెయ్యకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపమని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడుకోవాల్సిన చంద్రబాబు అందరికీ నీతులు చెబుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు ఎలాంటి వారో ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు. నారా లోకేష్‌కు పోటీ వస్తాడని జూనియర్ ఎన్టీఆర్‌ను మహానాడుకు పిలువలేదని పొంగులేటి అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యాయం ముగిసిందని కాంగ్రెసు నాయకుడు తులసిరెడ్డి అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు. మహానాడులో చంద్రబాబు కాలం చెల్లిన విధానాలను పాటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications