ప్రజల పక్షం వల్లనే జగన్‌కు జైలు: వైయస్ భారతి

హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వైయస్ భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రజల పక్షాన మాట్లాడేవారు ఉండకూడదన్నదే వారి ఉద్దేశమని, అందుకే జగన్‌ను జైలుకు పంపించారని ఆమె ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాది పాటు జగన్‌ను జైలులో పెట్టడం అన్యాయమని అన్నారు. దేవుడు ఉన్నాడు, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. వారి మాటలు విని ఉంటే జగన్‌పై కేసులు పెట్టేవారు కాదని ఆమె అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని, ఈ రోజు మంత్రులుగా ఉన్నవారంతా రాజశేఖర రెడ్డి వల్లనే మంత్రులయ్యారని, అటువంటి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే ఇన్ని కష్టాలు వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె అన్నారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను 2014 ఎన్నిక్లలో గెలిపించి ముఖ్యమంత్రిని చేద్దామని కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు పిలుపునిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని వారు మంగళవారం వరంగల్‌లో
చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు కొంత మంది మరిచిపోయి ఉండవచ్చు గానీ వైయస్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందినవారు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని కొండా దంపతులు అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications