కర్మని 78సార్లు గాయపర్చి చంపిన మహిళా మావోలు
రాయపూర్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, సల్వాజుడుం వ్యవస్థాపకులు మహేంద్ర కర్మను మావోయిస్టులు కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పరివర్తన్ యాత్రపై దాడి చేసిన మావోయిస్టులలో దాదాపు ముప్పై అయిదు నుండి యాభై మంది వరకు మహిళా మావోయిస్టులు కూడా పాల్గొన్నారు. వారిలో పలువురు మహేంద్ర కర్మను 78 సార్లు గాయపర్చారట. ఈ విషయాన్ని ఓ కమాండో చెప్పారు.
దాడి సమయంలో మావోలు అందరినీ పూర్తిగా చెక్ చేసి వివరాలు అడిగారు. మహేంద్ర కర్మను పట్టుకొని అతనే అని నిర్ధారణకు వచ్చాక రోడ్డు పక్కకు తీసుకు వెళ్లారు. ఓ మావోయిస్టు అతని కారులో ఉన్న లంచ్‌ను తీసుకు వచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ మహిళా మావోయిస్టు అతని వెనుక కాల్చారు. మహేంద్ర కర్మ కింద పడలేదు. మరో మహిళా మావో ఓ కర్రతో అతని కాళ్ల పైన బాదింది.
ఆ తర్వాత మిగతా మహిళా మావోయిస్టులు అతనిని చితకబాదారు. ఆ తర్వాత అతనిని పొడిచారు. మహేంద్ర కర్మ పోస్టుమార్టం రిపోర్టులో 78 గాట్లు ఉన్నట్లుగా తేలింది. అందులో ముడు పోట్లు ముఖం పైన ఉన్నాయి. ఇతని తలను రాళ్లతో క్రష్ చేశారని తేలింది.












Click it and Unblock the Notifications