వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్టు దిగిన శ్రీనివాసన్: పదవికి రేపు రాజీనామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivasan
న్యూఢిల్లీ: ఒత్తిడి తీవ్రం కావడంతో బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ మెట్టు దిగినట్లు కనిపిస్తున్నారు. చెన్నైలో రేపు ఆదివారం బిసిసిఐ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఈ సమావేశంలో ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. బిసిసిఐలో దాదాపు ఆయన ఒంటరి అయిపోయారు.

ఈ నెల 8వ తేదీన శ్రీనివాసన్ బిసిసిఐ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఒత్తిడి తీవ్రం కావడంతో రేపే సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చెన్నైలో బిసిసిఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం జరుగుతుందని బిసిసిఐ గేమ్ గేమ్ డెవలప్‌మెంట్ మేనేజర్ రత్నాకర్ శెట్టి చెప్పారు.

వచ్చే 24 గంటల్లో విశేషమైన పరిణామం చోటు చేసుకుంటుందని బిసిసిఐ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీ, సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పిన కొద్ది గంటలకే అత్యవసర సమావేశం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రకటన వెలువడవచ్చునని, ఓ రోజు నిరీక్షించాలని ఐపియల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. శ్రీనివాసన్ రాజీనామా అనంతరం రేపటి సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి.

శశాంక్ మనోహర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షుడు కొనసాగుతాడు. శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన తర్వాత రోజు రోజుకూ బిసిసిఐలో సంక్షోభం ముదురుతూ వచ్చింది.

English summary
An emergency meeting of the BCCI will be held in Chennai on Sunday in which beleaguered president N Srinivasan may announce his resignation from the post after he has been virtually isolated by his team in the board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X