వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పోరు: అసెంబ్లీకి షీలా దీక్షిత్‌పై కేజ్రీవాల్ పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో కాకలు తీరిన షీలాదీక్షిత్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్ కేజ్రీవాల్ ఢీకొనబోతున్నారు.

ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో అక్కడి నుంచే తలపడాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఏఏపీ కార్యకర్తల సదస్సులో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని, షీలాను నేరుగా ఎదుర్కొంటానని ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆమెకు పోటీగా బీజేపీ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందంటూ విమర్శించారు.

దమ్ముంటే తనపై, దీక్షిత్‌పై ఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ విజయ్ గోయల్‌కు సవాల్ విసిరారు. ఒకవేళ దీక్షిత్ ఓటమి భయంతో వేరొక నియోజకవర్గానికి మారితే తాను కూడా అక్కడి నుంచే పోటీకి దిగుతానని చెప్పారు.

అయితే ఓ ప్రక్రియ అనంతరమే కేజ్రీవాల్ నియోజవర్గ మార్పుకు ఆమోదం లభిస్తుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలోని 100 మంది సంతకాలు సేకరించడంతో పాటు ఏఏపీ రాజకీయ వ్యవహారాల కమిటీ, స్క్రీనింగ్ కమిటీ ఇంటర్వ్యూలు జరిపిన అనంతరమే ఈ మార్పునకు ఆమోదం లభిస్తుంది.

English summary
Arvind Kejriwal announced that he will contest against Delhi chief minister Sheila Dikshit in the Delhi assembly polls. However, a final decision on this will be taken by his Aam Aadmi Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X