వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోలకు, క్రికెటర్లకు నో చెప్పండి: రోల్ మోడల్‌పై జెడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
రాజమండ్రి: సినిమా హీరోలను, క్రికెటర్లను రోల్ మోడల్స్‌గా కాకుండా తల్లిదండ్రులను, గురువులను ఆదర్శంగా తీసుకోవాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఆదివారం అన్నారు. అవినీతిని యువత మాత్రమే రూపుమాపగలదన్నారు.

అవినీతిని అరికట్టేందుకు యువత నడుం బిగించాలని ఆయన సూచించారు. తాను బదలీ అయినంత మాత్రాన కేసుల దర్యాఫ్తుపై ఎలాంటి ప్రభావం పడదని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, సినిమాలు తదితరాలకు యువత బానిసలు కావొద్దన్నారు. మొక్కలు నాటడం, సహాయం చేయడం వంటి గుణాలు అలవర్చుకోవాలన్నారు. ఆయన ఈ రోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.

అంతకుముందు రోజు ఆయన విశాఖపట్ంలో మాట్లాడారు. తన బదలీ కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి తదితర కేసుల దర్యాఫ్తుపై ప్రభావం ఉండదన్నారు. సిబిఐలో వ్యవస్థలన్నీ పకడ్బందీగా ఉంటాయని, వ్యక్తుల ప్రభావం ఉండదన్నారు. కేసుల దర్యాఫ్తులోను ఎలాంటి ఒత్తిళ్లు లేవని, నిబంధనల ప్రకారం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.

జగన్ ఆస్తుల కేసుల దర్యాఫ్తు నేపథ్యంలోనే తనకు అదనంగా రెండెళ్లు పొడిగించారనేది అవాస్తవమన్నారు. పదోన్నతి పొందితే మరో రెండేళ్లు కొనసాగవచ్చునని సిబిఐ నిబంధనల్లో ఉందన్నారు. ఇందుకు అనుగుణంగానే తాను ఐజిగా పదోన్నతి పొందటం వల్లనే హైదరాబాదులో కొనసాగానని చెప్పారు.

English summary
CBI JD Laxmi Narayana suggested youth that don't take Cinema Heros and Cricketers as role model.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X