ఆశ్చర్యం కలగలేదు: మోడీవర్గం, గుజరాత్‌పై చంద్రబాబు

మరోవైపు పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన లాల్ కృష్ణ అద్వానీ ఎన్డీయే కన్వీనర్ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అద్వానీ రాజీనామా తమను బాధించిందని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. త్వరలో పార్టీలోని సమస్యలు అన్ని సమసిపోతాయని చెప్పారు.
మోడీ టిడిపిని ఫాలో అయ్యారు: చంద్రబాబు
అద్వానీ రాజీనామా బిజెపి అంతర్గత వ్యవహారమని, దానిపై తాను మాట్లాడనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గుజరాత్‌ను మోడి అభివృద్ధి చేయడం కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌ను తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందన్నారు. మోడీ ఎపిని ఫాలో అయ్యారన్నారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
మోడిపై మంత్రి మండిపాటు
పేద ప్రజలకు గుజరాత్‌లో స్థానం లేదని, హిట్లర్, మోడీ వంటి నేతలు దేశానికి అవసరం లేదని మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఓట్లు రాలినంత మాత్రాన నేర చరిత్రను అంగీకరించలేమన్నారు. ప్రజాస్వామ్యానికి మోడీ మాయని మచ్చ అని ఆరోపించారు.
పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లిన నేత: శరద్ యాదవ్
అద్వానీ నిర్ణయం తనను బాధించిందని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఉన్నత శిఖరాలకు వ్యక్తి అద్వానీ అన్నారు. ఆయన ముందు చూపున్న నేత అని, ఈ వ్యవహారంపై త్వరలో జెడి(యు) సమావేశమవుతుందని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఇది ఎన్డీయేకు మేలు చేయదన్నారు.












Click it and Unblock the Notifications