వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవాలాపై కూపీలాగండి: స్పాట్ ఫిక్సింగ్‌పై ఈడికి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Spot Fixing: Police focus on Hawala
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పోలీసులు హవాలా అంశంపై దృష్టి సారిస్తున్నారు. హవాలా పైన దర్యాఫ్తు చేసే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి)కి ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో హవాలా ద్వారా డబ్బులు వచ్చినట్లుగా తెలుస్తోందని, దానిని కూపీలాగాలని ఈడిని కోరుతూ లేఖ రాశారు.

ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తాము అరెస్టు చేసిన 27 మంది లిస్టును ఈడికి అందజేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో హవాలా ద్వారా డబ్బులు వచ్చినట్లుగా భావిస్తున్నామని, భారత్‌తో పాటు దుబాయ్, కరాచీలలో ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయని, దీంతో హవాలా ద్వారా వచ్చిన డబ్బులపై విచారణ జరిపించాలని తాము ఈడికి లేఖ రాశామని పోలీసులు చెబుతున్నారు.

ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నట్లుగా ఈడికి తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కీలకంగా ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో నిందితుల పైన ఈడి ఇప్పటికే ప్రత్యేకంగా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆదివారం మాట్లాడుతూ... క్రికెట్‌లో దుష్ట ఆటగాళ్లను ఏరివేయాల్సిన సమయం ఆసన్నమైనదని చెప్పారు. క్రికెట్‌ను పెద్దమనుషుల క్రీడగా భావించేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
The Delhi Police has written to the Enforcement Directorate for a probe into alleged hawala transactions in the IPL spot—fixing case, including by underworld don Dawood Ibrahim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X