ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడి: విసి శుక్లా కన్నుమూత

దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. శుక్లా మృతితో ఛత్తీస్‌గఢ్ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 29కి చేరింది. శుక్లా 1966లో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కేబినెట్లో పని చేశారు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
మావోయిస్టులు గత నెల 25వ తేదిన ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు నేతలపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శుక్లా శరీరంలోకి మూడు బుల్లెట్లు చొచ్చుకు వెళ్లాయి. వైద్యులు ఆయన ప్రాణాలు నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేశారు. శుక్లా శ్వాశ పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని మేదాంతా వైద్యులు కొద్ది గంటల క్రితం చెప్పారు.
కిడ్నీ పని చేయడం మానేసిందని, డయాలసిస్ చేయాలని చెప్పారు. అప్పటికే రెండు సర్జరీలు చేశారు. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు దాడి ఘటనలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, సల్వాజుడుం వ్యవస్థాపకులు మహేంద్ర కర్మ, పిసిసి అధ్యక్షుడు, ఆయన తనయుడు పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications