రితితో రిలేషన్ తెంచుకో: ధోనీకి సావంత్, ఇప్పుడే కాదు

ఈ విషయంపై ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాకనే విచారణ చేపడతామని బిసిసిఐ ఆపద్ధర్మ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక ఈ విషయంపై దృష్టి సారించనున్నామని, ప్రస్తుతం జట్టు ఏకాగ్రతను భంగం చేయాలనుకోవడం లేదన్నారు. బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం మరోలా స్పందించారు.
ధోనీపై బోర్డు కోశాధికారి రవి సావంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. సావంత్ మాట్లాడినది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. బోర్డుకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు ధోనికి కానీ మరో క్రికెటర్‌కు కానీ ఎలాంటి నోటీసు పంపే ఉద్దేశ్యం బోర్డుకు లేదన్నారు. వర్కింగ్ కమిటీ సమావేశంలోను దీనిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
తన స్నేహితుడు అరుణ్ పాండే నడుపుతున్న రితీ స్పోర్ట్స్‌లో ధోనీ భాగస్వామి అని ఇదే సంస్థతో సురేష్ రైనా, రవీంద్ర జడెజా, ప్రజ్ఞాన్ ఓఝాలు కూడా ఒప్పందం చేసుకోవడంతో జట్టు సెలక్షన్ సమయంలో అతను అనుచిత లబ్ధి పొందే అవకాశం ఉందనే విమర్శలు వచ్చాయి.












Click it and Unblock the Notifications