మోడీ ఫ్యాక్టర్: నితీష్‌తో మమతా ఫెడరల్ ఫ్రంట్ మాట

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా ఆమె మాట్లాడారు. తాను నితీష్ కుమార్‌తో మాట్లాడానని, అందరం కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నితీష్ అభిప్రాయపడ్డారని మమతా బెనర్జీ చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో తాము మాట్లాడుతామని ఆమె చెప్పారు. తన అధికారిక ఛేంబర్‌లో జెడి(యు) ప్రధాన కార్యదర్శి కెసి త్యాగితో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆ విషయంపైనే తనతో మాట్లాడడానికి త్యాగి వచ్చినట్లు మమతా బెనర్జీ చెప్పారు. తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. తర్వాత మరోసారి మాట్లాడుకుని ఎక్కడ సమావేశం కావాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ చెప్పారు.
తనకు చాలా సంతోషంగా ఉందని, జెవిఎం-పి చీఫ్ బాబూలాల్ మారాండి కొన్ని రోజుల క్రితం ఆ విషయం గరించి మాట్లాడడానికే జార్ఖండ్ నుంచి వచ్చారని, ఇద్దరు ముగ్గురు ఇతర నాయకులు కూడా వచ్చి మాట్లాడారని ఆమె చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!