వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు, తప్పించుకున్న కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR and OU JAC call for Telangana bandh
హైదరాబాద్: చలో అసెంబ్లీ సమయంలో పోలీసులు, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం తెలంగాణ వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెలంగాణ బంద్ తెలంగాణవాదులు, తెరాస క్యాడర్ విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్యబద్ధంగా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను, ఐక్యకార్యాచరణ సమితి నేతలను, భారతీయ జనతా పార్టీ, సిపిఐ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాస కూడా బందుకు పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో మిలటరీ పాలన సాగుతున్నట్లుగా కనిపిస్తోందని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తాజా పరిస్థితులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభ్యుల సభా హక్కులను కాపాడాల్సిన బాధ్యత సభాపతి పైన ఉందన్నారు. మరోవైపు అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ తీసుకు వెళ్తుండగా, తప్పించుకున్న ఆమె తిరిగి అసెంబ్లీ వైపుకు దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.

ఆజాద్‌తో డిఎస్ భేటీ

శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ శుక్రవారం కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు ఆజాద్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. వారి మధ్య రాష్ట్రంలోని తాజా పరిస్థితిల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

English summary
Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao and OU JAC called for Telangana bandh on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X