బోడతో కెసిఆర్, జగన్‌కు కిరణ్ కౌంటర్, పెద్దపల్లిపై హామీ!

దీంతో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరుతున్నారు. నేతలు పార్టీలు మారుతుండటం అధికార కాంగ్రెసు పార్టీకి మింగుడు పడటం లేదు. నేతలు విడిచి వెళుతుండటంతో పార్టీ పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా ఉందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలలో కూడా ఉంది. అయితే ఎన్నికలకు ముందు ప్రజలను కాంగ్రెసు వైపుకు తిప్పాలనే యోచనలో కిరణ్, ఇతర నేతలు ఉన్నారట.
అందులో భాగంగా కిరణ్ పలు పథకాలు ప్రవేశ పెడుతూ దూసుకెళ్తున్నారు. అయితే పలువురు నేతలు పార్టీని వీడటంతో అందుకు కౌంటర్‌గా ఆయా పార్టీలలోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్పించుకోవాలని చూస్తున్నారట. అదిలాబాద్ జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బోడ జనార్ధన్ ఈ నెల 27వ తేదిన ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
తెలంగాణ ప్రాంతానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతను తమ వైపుకు రప్పించుకోవడం ద్వారా ఒకేసారి కెసిఆర్, జగన్‌లకు షాక్ ఇచ్చినట్లవుతుందని కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సత్తా కాంగ్రెసుకు మాత్రమే ఉందని కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. కాంగ్రెసులో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్న బోడ తన చేరిక సభకు భారీగా ప్రజలను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారట.
పెద్దపల్లి పార్లమెంటు స్థానంపై బోడ జనార్ధన్‌కు హామీ లభించినట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వివేక్ తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో అంగబలం, అర్థబలం ఉన్న బోడను పెద్దపల్లి నుండి బరిలోకి దించాలని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారట. బోడ తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పని చేశారు. ఏడాదిన్నర క్రితం అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఒకరిద్దరు చేరినంత మాత్రాన తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు వచ్చే నష్టమేమీ లేదని మరికొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications