మమత దూకుడుకు లెఫ్ట్ చెక్: టిడిపి, జెడియులతో చర్చ

శరద్ యాదవ్‌తో శనివారం సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు చర్చలు జరిపారు. ఎన్డీయేలో సంక్షోభానికి సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితిపై ఆరా తీశారు. అయితే, తమ మధ్య జరిగిన చర్చలపై ముగ్గురూ పెదవి విప్పడం లేదు. శరద్ యాదవ్‌ను ఆయన నివాసంలో సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కలుసుకున్న మర్నాడే ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ అత్యవసరమని తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ చెప్పారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం విఫలమైందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందని సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిరణ్మయి నందా వ్యాఖ్యానించారు. బిజెపితో జెడి(యు) తెగదెంపులు చేసుకోవాలని భావించడాన్ని స్వాగతిస్తున్నామని, ఆ పార్టీ లౌకిక శక్తులతో చేతులు కలపాలని ఎన్సీపి ప్రకటించింది.
తృతీయ ఫ్రంట్ ఏర్పడితే అది నెలలు నిండక మునుపే పుట్టిన శిశువులా ఉంటుందని కేంద్ర మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో మూడో ఫ్రంట్ విజయం సాధించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు వామపక్షాలు.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఎస్పీ అధినేత ములాయం, బిజెడి చీఫ్ నవీన్ పట్నాయక్ తదితరులతో మాట్లాడినట్లుగా సమాచారం.
తద్వారా వామపక్షాలు మమతా బెనర్జీ ఫ్రంట్‌కు గండికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా అందులో ఉండేందుకు వామపక్షాలు సిద్ధంగా లేవు. మమత ఫెడరల్ ఫ్రంట్ అనగానే అనూహ్య స్పందన కనిపించింది. ఫెడరల్ కనిపించకుండా ఉండేందుకు వామపక్షాలు అన్ని లౌకికవాద పార్టీలతో మాట్లాడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఏ ఫ్రంట్ అయినా ఎన్నికల తర్వాతనే ఓ స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications