ఇక రెండే రోజులు: దగ్గుబాటికి టిఎస్సార్ హెచ్చరిక

విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం టిఎస్సార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 80 బస్తాల సిమెంట్ అమ్ముకుని డబ్బుకాజేశానని తనపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ రకంగా తన పరువు తీశారని చెప్పారు. తన జీవిత కాలంలో ఇంత వరకు ఏ తప్పు చేయలేదని, మచ్చలేని జీవితం తమదని అయన ప్రకటించుకున్నారు.
తనది ఎనబై బస్తాల సిమెంట్ కోసం కక్కుర్తిపడే జీవితం కాదని ఆయన అన్నారు. వెంకటేశ్వరరావు రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేయడంతోపాటు కేసు వేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలో విశాఖ నుండే పోటీ చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో ఎల్.కోట మాజీ జెడ్‌పిటిసి తూర్పాటి వరలక్ష్మి, భీమసింగి తూర్పాటి కృష్ణస్వామినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, రమణకుమారి, కె.సూర్యారావు, ఎల్.కోట పిఎసిఎస్ అధ్యక్షురాలు కె.రమాకుమారి, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications