పెళ్లిని వదిలేసి ఆమె పరారీ: తాళ్లికట్టి ప్రియుడు పరారీ

మదనపల్లె మండలానికి చెందిన శ్రీనివాసులుకు అక్కకూతురితో పెళ్లి కుదిరింది. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించడంతో వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంది. మళ్లీ అతడు పారిపోవడంతో తిరిగి కళ్యాణమండపానికి చేరుకుంది. అప్పటికే అక్కడంతా ఆ విషయం తెలియడంతో చేసేది లేక అమ్మాయిని తీసుకుని ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని తమ ఊరు వెళ్లిపోయారు.
గుంటూరు జిల్లాలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని తీసింది. విద్యుత్ తీగలు తెగిపడినా పట్టించుకోకపోవడంతో నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఆర్‌సీఎం పాఠశాలలో ఈ దుర్ఘటన జరిగింది.
పట్లవీడు జుబేదా (9) ఆ పాఠశాలలో మూడోతరగతి చదువుతోంది. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన జుబేదా తండ్రి షేక్‌గౌస్ టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన జుబేదా.. మధ్యలో బాత్‌రూంకు వెళ్లింది. కానీ బాత్‌రూంలోని నీటితొట్టిపై ఓ విద్యుత్ తీగ తెగి పడి ఉంది. ఈ తీగ జుబేదాకు తగలడంతో ఆమె విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించింది.












Click it and Unblock the Notifications