నీళ్లివ్వలేదని బస్ హోస్టెస్‌పై మహిళా ఎమ్మెల్యే చేయి

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
అధికార పిఎంఎల్(ఎన్) పార్టీకి చెందిన నిఘత్ షేక్ లగ్జరీ బస్సులో ముర్రే నుండి లాహోర్ వెళుతున్నారు. పర్యటన నిమిత్తం ఆమె కుటుంబంతో సహా బయలుదేరారు. సమాచారం మేరకు.. నిఘత్ షేక్.. హోస్టెస్ ఇక్రా నవాజ్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆమెపై చేయి చేసుకున్నారు... బెదిరించారు.
ఈ ఘటనపై పోలీసు కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధి తనకు నీరు కావాలని అడిగిన వెంటనే హోస్టెస్ తీసుకు రాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు చెప్పారు. హోస్టెస్‌పై చేయి చేసుకున్న ప్రజాప్రతినిధి, ఆ తర్వాత పోలీసులను పిలిపించారు. హోస్టెస్‌నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ ఇటీవలే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని, ముఖ్యమంత్రలు దీనిపై విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications