ఆంధ్రులకు రైలు: ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్
న్యూఢిల్లీ/ డెహ్రాడూన్: ఉత్తర కాశీ యాత్రకు వెళ్లి అక్కడ వరదల నుంచి బయటపడి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారి కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. అలాగే కాజీపేట్ నుంచి విశాఖపట్టణం, హైదరాబాద్ నుంచి సూళ్లూరుపేటకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న 500 మంది యాత్రికులను అధికారులు ఢిల్లీలోని ఎపి భవన్‌కు తరలించారు. వరద బాధితులను కేంద్రమంత్రులు చిరంజీవి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కావూరి సాంబశివరావు, బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు పరామర్శించారు.

వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్ సహాయనిధికి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ప్రకటించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఉత్తరాఖండ్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన కోరారు.
ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్ కుప్పకూలింది. బాధితులను తరలించడానికి ఆ హెలికాప్టర్‌ను వాడుతున్నారు. అది కూలిన సమయంలో బాధిత యాత్రికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైలట్ సమయస్ఫూర్తితో ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరకాశీ యాత్రకు వెళ్ళి, వరదల్లో చిక్కుకుపోయిన యాత్రికులను కాపాడ్డానికి ఈ హెలికాఫ్టర్ వెళ్ళింది.












Click it and Unblock the Notifications