'అమ్మ' ఇడ్లీ హిట్: ఇప్పుడు 'అమ్మ' మినరల్ వాటర్

Jayalalithaa
చెన్నై: ఈ ఏడాది జనవరిలో క్యాంటిన్లు ఏర్పాటు చేసి రూపాయికే ఇడ్లీలు అందిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు తక్కువ ధరకు మంచినీళ్లు అందించేందుకు సిద్ధపడ్డారు. పది రూపాయలకే లీటర్ మినరల్ వాటర్ బాటిల్ లభించే ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్లను తక్కువ ధరకు అందిస్తుందని జయలలిత చెప్పారు.

అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. మొదటి ప్లాంటును చెన్నై శివారులోని గుమ్ముండిపూండిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. రోజుకు మూడు లక్షల లీటర్ల మినరల్ వాటర్‌ను ఇది అందిస్తుందని, సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అది పనిచేయడం ప్రారంభిస్తుందని ఆమె అన్నారు.

ఆ మినరల్ వాటర్ బాటిల్స్‌ను ఎక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో, బస్ స్టాండుల్లో విక్రయించనున్నట్లు ఆమె తెలిపారు. రైల్వేలు 15 రూపాయలకు, ప్రైవేట్ సంస్థలు 20 రూపాయలకు లీటర్ మినరల్ వాటర్ విక్రయిస్తుండగా తమ రోడ్డు రవాణా సంస్థ పది రూపాయలకే అందిస్తుందని ఆమె చెప్పారు.

ఆహార పదార్థాలను తక్కువ ధరకు విక్రయించడానికి తమ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మ క్యాంటిన్లను తెరిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తక్కువ ధరలకు కూరగాయలను అందించడానికి ప్రభుత్వం ఇటీవల దుకాణాలను కూడా తెరిచింది. చెన్నైలోనూ, శివారుల్లోనూ అటువంటి కూరగాయల దుకాణాలు 31 ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+