వరదలు: విమానాలు పంపిన మోడీ, జాడలేని రాహుల్

ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చొరవచూపిన దాఖలాలు లేవు. శుక్రవారం రాత్రే ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో సహాయ కార్యక్రమాలను పరిశీలించారు. శనివారం విహంగ వీక్షణం ద్వారా ఆ ప్రాంతాల్ని చూశారు.
గుజరాత్‌కు చెందిన యాత్రికులను తరలించేందుకు జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన రెండు 747 బోయింగ్‌లను డెహ్రాడూన్‌కు మోడీ పంపించారు. ఒక్కో బోయింగ్‌లో 140 మందిని తరలించే వీలుంది. ఈ విమానాల ద్వారా పలువురిని అహ్మదాబాద్‌కు తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
లేని రాహుల్ జాడ
ఉత్తరాఖండ్ విలయం దేశవ్యాప్తంగా అందరు స్పందిస్తుంటే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మాత్రం కనిపించడం లేదు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ వచ్చి వెళ్లారు. రాహుల్ మాత్రం రాలేదు.
రోశయ్య బంధువుల భయం
చార్ ధామ్ యాత్ర అంటే ఇప్పుడు భక్తులు భయపడుతున్నారు. వరదల కారణంగా చాలామంది మృతి చెందారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్న భక్తులు కూడా ఆ షాక్ నుండి కోలుకోలేదు. అమ్మో.. చార్ ధామ్ యాత్రకు మళ్లీ వెళ్లడమా.. తామే కాదు.. వేలాది యాత్రికులు షాక్ నుండి కోలుకోలేదని, ప్రాణాలపై ఆశలు వదులుకొని భగవంతునిపై భారం వేశామని తమిళనాడు గవర్నర్ రోశయ్య సమీప బంధువులు కొణిజేటి రాధాకృష్ణ మూర్తి చెబుతున్నారు.
మళ్లీ వర్షం
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు పడుతున్నందున సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.












Click it and Unblock the Notifications