వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైన్ షాపుల పక్కన పర్మిట్ రూంలు: డిఎల్ ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

parthasarathi and dl ravindra reddy
హైదరాబాద్: మద్యం షాపుల పక్కనే పర్మిట్ రూంలకు అనుమతినిస్తున్నట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు. వాటిల్లో కుర్చీలు, తినుబండారాలు ఉండకూడదని ఆదేశించారు. గుడి, బడికి వంద మీటర్ల దూరంలో ఉన్న షాపులను తొలగించాలని ఆయన ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం తాగవద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, ప్రతి జిల్లాలో డి-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బార్ల పాలసీపై నివేదికను త్వరలో ప్రకటిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. బెల్టు షాపులపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో మంత్రి పర్మిట్ రూంల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.

పర్మిట్ రూంల ఏర్పాటు నిర్ణయాన్ని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెల్డ్‌షాపులే వద్దని మహిళలు కోరుతుంటే పర్మిట్ షాపులకు అనుమతిని ఇవ్వడం సిగ్గుచేటని ఆయన అన్నారు.. బెల్ట్ షాపు నిర్వహకులను తరిమికొట్టాలని ప్రజలకు డీఎల్ పిలుపునిచ్చారు.

చాలా కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై డిఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన నిర్ణయాలను తప్పు పడుతూ వస్తున్నారు. బంగారుతల్లి పథకం విషయంలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యతిరేకత కారణంగా ఆయన మంత్రిపదవిని కూడా కోల్పోయారు. తాజాగా పర్మిట్ రూంల వ్యవహారాన్ని ఆయన తప్పు పట్టారు.

English summary
minister Parthasarathi said that permit rooms will be allowed near wine shops. Congress MLA and DL Ravindra Reddy opposed the decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X