వరదలు: లక్ష్మీపార్వతి ఫైర్, కేదార్‌నాథ్ ఎమ్మెల్యేపై దాడి

ఇతర రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించారని చెప్పారు. తెలుగు యాత్రికులకు ఎపి భవన్‌లో అవమానం జరుగుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో సామాన్య భక్తులను విఐపిల సేవ కోసం ఇబ్బంది పెట్టవద్దని ఆమె కోరారు. ప్రోటోకాల్ పేరిట భక్తుల సహనాన్ని పరీక్షించవద్దన్నారు.
కేదార్‌నాథ్ శాసన సభ్యురాలు శైరా రాణి రావత్ పైన స్థానికులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వారు మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన ఆమెను స్థానికులు తరిమికొట్టారు. ప్రాణ భయంతో శైలా రాణి రావత్ అడవిలో తలదాచుకున్నారు.
కేదార్‌నాథ్‌లో అరవై మంది
వాతావరణం అనుకూలించక పోవడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. కేదార్‌నాథ్‌లో దాదాపు అరవై మంది యాత్రికులు సహాయం కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications