వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలు: వివక్షపై షిండేకు చిరు, కొట్లాటపై నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Narayana
న్యూఢిల్లీ/హైదరాబాద్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను ఆదుకునే విషయంలో తెలుగు వారి పట్ల చూపుతున్న వివక్షను తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకు వెళ్లానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గురువారం అన్నారు. రాష్ట్రానికి చెందిన యాత్రుకులను తాము సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.

గతంలో ఎన్నడూ జరగనంత విపత్తు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌కు పర్యాటక శాఖ నుండి సహాయం చేశామన్నారు. వరద బాధితుల విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానందే అంతిమ నిర్ణయమని చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే అంచనా తనకు లేదన్నారు.

చార్ ధామ్ వెళ్లిన రాష్ట్ర యాత్రికులను స్వస్థలాలకు తరలిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వరద రాజకీయాలు చేయడం తగదన్నారు. తాము ఈ నెల 30వ తేదిన తెలంగాణ ఆకాంక్షను చాటేందుకే సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

బద్రీనాథ్‌లో ఇంకా తెలుగువారు..

ఉత్తరాఖండ్ వరదల్లో ఇంకా దాదాపు ఐదువేల మంది యాత్రికులు వరదల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో తెలుగు వారు కూడా ఉన్నారు. బద్రీనాథ్ వద్ద రెండు మూడు వందల మంది తెలుగువారు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చార్ ధామ్ యాత్రకు వెళ్లి తిరిగి రాని వారు ఫోటోలను ఉత్తరాఖండ్ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్ వెళ్లనున్నారు.

కొట్లాటకు అక్కడకెళ్లాలా?: నారాయణ

కాంగ్రెసు పార్టీ నేతలు కొట్లాడుకునేందుకు ఢిల్లీ వరకు వెళ్లాలా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గురువారం కడప జిల్లాలో ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఆయన ఈ రోజు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎంపీల తీరు కుక్కల కొట్లాటలా ఉందన్నారు. కొట్లాడుకునేందుకు మన రాష్ట్రంలో చాలా మైదానాలు ఉన్నాయని, అంత దూరం వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. ఎక్కడికో వెళ్లి రాష్ట్రం పరువు తీయడమెందుకన్నారు. కాంగ్రెసు నేతలే పరువు తీశారన్నారు. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొందన్నారు. అధికార పార్టీ తీరు వల్లే పరువు పోయిందన్నారు.

English summary

 Central Toursim Minister Chiranjeevi has brought Uttarakhand Telugu devotees problems to Central Home Minister Sushil Kumar Shinde.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X