చెక్ బౌన్స్: జీవితా రాజశేఖర్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

ఈ నేపథ్యంలో వ్యాపార అవసరాల నిమిత్తం జీవిత గత ఏడాది పరంధామ రెడ్డి నుండి రూ.34 లక్షల మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు, రెండు చెక్కులు, హామీ పత్రాలను ఆయనకు జీవిత అందజేశారు. ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో పరంధామ రెడ్డి ఆమెకు చెప్పి రూ.34 లక్షలకు చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేశారు.
ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్టేట్ చెల్లని చెక్కు కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని జీవితా రాజశేఖర్‌ను ఆదేశిస్తూ కోర్టు నిన్న సమన్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications