వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి భవన్లో కిరణ్ టైంపాస్: తలసాని, మోడీపై యశ్వంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi - Talasani Srinivas Yadav
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజులుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి కోసం పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం మండిపడ్డారు. కిరణ్‌కు వారి అధినేత్రి కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో అతను ఎపి భవన్‌లో బాధితులను కలుస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు వారి పైన ఢిల్లీ నేతలకే కాకుండా ముఖ్యమంత్రికి కూడా చిన్న చూపు ఉండటం బాధాకరమన్నారు.

ఉత్తరాఖండ్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతై ఆచూకీ లభించిన రాష్ట్ర వాసులు ఇంకా 278 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ 153, రంగారెడ్డి 68, కరీంనగర్ 19, విశాఖ 10, కడప 10, చిత్తూరు 10, గుంటూరు 6, ప.గో 3, అనంతపురం 3, నిజామాబాద్ ఇద్దరు యాత్రికుల ఆచూకి లభ్యం కాలేదు. దీంతో గల్లంతైన వారి ఫోటోలు ఉత్తరాఖండ్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

జాతీయ నాయకులకు ప్రాంతీయ భావాలొద్దు: యశ్వంత్

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రచార సారథి నరేంద్ర మోడీ పైన ఆ పార్టీ నేత యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. జాతీయ నాయకులకు ప్రాంతీయ భావనలు ఉండటం ఏమాత్రం సరికాదని అన్నారు. నరేంద్ర మోడీ కేవలం గుజరాత్ భక్తులను మాత్రమే ఆదుకోవడం సరికాదని చెప్పారు. వరదలను రాజకీయం చేయడం ఏ పార్టీలకు తగదని ఆయన అన్నారు.

English summary
Telugudesam Party senior leader Talasani Srinivas Yadav has lashed out at CM Kiran Kumar Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X