పార్టీని వీడను: జగన్‌ను విడిచేది లేదన్న బాబాయ్

తాను కాంగ్రెసు పార్టీలోకి వెళ్తానని విషపూరిత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పదవుల కోసం తాను ఎప్పుడు పాకులాడలేదన్నారు. తానేంటో పులివెందుల ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. వైయస్ కుటుంబం, తన కుటుంబం వేర్వేరు కాదని చెప్పారు.
జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి పదమూడు నెలలు గడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిలలు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. వారి కష్టాన్ని చూసి పార్టీలోని ప్రతి కార్యకర్త ఉత్సాహంతో పని చేస్తున్నారన్నారు. భాస్కర రెడ్డి పులివెందుల ఇంఛార్జిగా ఉన్నారు.
కాగా, పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ భాస్కర రెడ్డికి అధికార పార్టీ గాలం వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. జగన్‌ను వదిలి మరో పార్టీలోకి వెళ్లేందుకు ఆయన మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. పార్టీ మారే వార్తలను ఆయన కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications