గుడికొచ్చిన గర్ల్‌పై అమానుషం, వాచ్‌మెన్‌ని ఎత్తుకెళ్లారు

అనంతరం ఆమెను బండరాళ్లతో బాది వంతెన కింద పడేశారు. అటవీ శాఖ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన యువతిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మణిపాల్ వర్సిటీ వైద్య విద్యార్థిని కేసు
మణిపూర్ విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసులో మణిపాల్ పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితులను కనిపెట్టేందుకు పోలీసులు దాదాపు 9వేల మంది ఆటో డ్రైవర్లను విచారించారు.
ఇద్దరు దారుణ హత్య
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం సల్కాపురం సమీపంలో ఫ్యాక్షన్‌కు ఇద్దరు బలయ్యారు. గురువారం ఉదయం తండ్రీకొడుకులు కర్నూలు కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రత్యర్థులు వారి పైన బాంబులతో దాడి చేశారు. ఆ తర్వాత వారిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. మృతులు కొడుమూరు గ్రామానికి చెందిన వెంకటరాముడు, అంజనేయులుగా గుర్తించారు.
అత్తను చంపిన అల్లుడు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పహాడీషరీఫ్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ అల్లుడు తన భార్య, అత్త, బావమరిదిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త, బావమరిది మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు దుబాయ్ నుండి ఈరోజే వచ్చాడు.
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10లో భూవివాదం కారణంగా అగంతకులు ఆరుగురిని అపహరించికుపోయారు. వాచ్‌మన్‌తో పాటు ఆరుగురిని అపహరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications