చంపే దమ్ముందా, నన్నుతాకి చూడండి: మమత సవాల్

Mamata Banerjee
కోల్‌కతా: మావోయిస్టులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. మావోయిస్టుల పేరెత్తితేనే మండిపడే ఆమె బుధవారం మరోసారి వారిపై విరుచుకుపడ్డారు. మావోయిస్టులు తనను చంపాలని చూస్తున్నారని, అయినా తానేమీ భయపడనని, వారి తుపాకులకు బెదిరేదే లేదని ఆమె స్పష్టం చేశారు.

మావోయిస్టులకు దమ్ముంటే తనను తాకి చూడాలని సవాల్ చేశారు. మావోయిస్టులకు తనను తాకే ధైర్యం ఉందా? ఒకవేళ ఉంటే ఆ పని చేయండని సవాల్ చేస్తున్నానని అన్నారు. ఎక్కడ, ఎప్పుడు తనను చంపాలనుకుంటున్నారో చెప్పమనండి, అక్కడికి తానే ధైర్యంగా వెళతానని అన్నారు.

వారి తుపాకులు తనను భయపెట్టవని, 34 ఏళ్లుగా సిపిఎం వారి తుపాకులతో పోరాడుతూనే ఉన్నానని అన్నారు. సిపిఎంపై కూడా దీదీ ధ్వజమెత్తారు. జంగల్ మహల్‌లో మళ్లీ హింసను ప్రేరేపించడానికి మావోయిస్టులతో కలిసి ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే మావోయిస్టులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం చెబుతుందన్నారు.

కాగా, వారం రోజుల క్రితం ఆమె మాట్లాడూతూ తనను హత్య చేసే కుట్ర జరుగుతోందనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో అధికారం కోసం తనను హత్య చేసేందుకు మావోయిస్టులతో సిపిఎం కుమ్మక్కైందని ఆమె ఆరోపించారు. మాత, మట్టి, ప్రజలు అండగా ఉండి వారి కుట్రను తిప్పి కొడతారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+