ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు: వరదలపై మర్రి ప్రకటన

మరోవైపు ఉత్తరాఖండ్ వరదల పైన ఎన్డీఎంఏ సమావేశమైంది. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. ఉత్తరాఖండ్ వరదల్లో 556 మంది మృతి చెందారని చెప్పారు. ఇంకా 1800 మంది వరదల్లో చిక్కుకుపోయారన్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించనట్లు చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదంలో 18 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు.
కాగా ఈ రోజు సాయంత్రం 130 మంది యాత్రికులతో ప్రత్యేక విమానం డెహ్రాడూన్ నుండి బయలుదేరుతుందని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 250 మంది తెలుగు యాత్రికులు కాలి నడకన జోషిమఠ్ బయలుదేరారని చెప్పారు.
తెలుగు యాత్రికులు జోషిమఠ్ నుంచి శుక్రవారం సాయంత్రం డెహ్రాడూన్ చేరుకునే అవకాశముందన్నారు. రేపు డెహ్రాడూన్ నుండి యాత్రికులను ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలిస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications