మహిళపై పిజ్జా డెలివరీ బాయ్ రేప్, హత్యాయత్నం

pizza delivery boy tries to rape, kill woman
ముంబై: వొర్లి ప్రాంతంలో 17 ఏళ్ల పిజ్జా డెలివరీ బాయ్ 24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ప్రయత్నించి, హత్య చేయడానికి చూశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు వార్ధాకు చెందిన సివిల్ ఇంజనీర్. ఉద్యోగం వెతుక్కోవడానికి ఆమె ముంబై వచ్చింది. అన్నీబిసెంట్‌ రోడ్డులోని తన ఆంటీ ఇంట్లో ఆమె ఉంటోంది.

పోలీసుల కథనం ప్రకారం - బాధితురాలు మంగళవారం సాయంత్రం స్థానికంగా ఓ పిజ్జా దుకాణానికి ఫోన్ చేిస, ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆంటీ ఇంట్లో లేదు. ఆమె పూణేకు వెళ్లింది. బాధితురాలు ఒక్కతే ఉంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో నిందితుడు పిజ్జాను మొదటి అంతస్థులోని ఇంట్లో ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇంట్లో ఒక్కతే ఉందని గ్రహించిన అతను తిరిగి వెంటనే వచ్చి డోర్ బెల్ కొట్టాడు. సాస్, చిల్లీ ఫ్లేక్స్ ఇవ్వడం మరిచిపోయానని చెప్పాడు.

అలా చెబుతూనే అకస్మాత్తుగా బాధితురాలిని నెట్టేసి, ఇంట్లోకి చొరబడి బోల్డ్ పెట్టేశాడు. వంటగదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో వంటగదిలోని కత్తిని తీసుకుని ఆమె గొంతుపై, మణికట్టుపై కోశాడు.

అతి కష్టం మీద ఆమె గ్రైండింగ్ స్టోన్ అందుకుని అతని ముఖంపై కొట్టింది. ఆమె గట్టిగా అరవడంతో అతను భయపడి పారిపోయాడు. ఆమె అరుపులకు ఇరుగుపొరుగువారు వచ్చారు. ఆమెను పోదార్ ఆస్పత్రికి తరలించి, ఆంటీకి ఫోన్ చేశారు. ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో పోలీసులు వచ్చి బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ తర్వాత అమ్మాయిని నాయర్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పిజ్జా షాప్‌నకు వెళ్లారు. తాళం వేసి ఉండడంతో యజమాని చిరునామా కనుక్కుని వెళ్లి బాయ్ ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని బుధవారం తెల్లవారు జామున వొర్లి కోలివాడ చావల్ గదిలో పట్టుకున్నారు. డెలివరీ బాయ్స్ లేకపోవడంతో ఆ బాలుడ్ని తాను పంపినట్లు దుకాణం యజమాని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+