విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు నేత ఆత్మహత్య, కలకలం: పోలీసు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారలోని ఉప్పల్ కాంగ్రెస్ నేత యంజాల శ్రీధర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామాంతపూర్ కార్పోరేటర్ పరమేశ్వర్‌రెడ్డిపై హత్యయత్నం కేసులో అరెస్టయిన శ్రీధర్‌రెడ్డి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.

తనను మాల్కాజ్‌గిరి ఏఎస్పీ రాధాకృష్ణ వేధిస్తున్నాడని, రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని శ్రీధర్‌రెడ్డి 10 పేజీల సోసైడ్ నోట్ రాశారు. కాగా శ్రీధర్‌రెడ్డి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం నడుచుకున్నానని ఏఎస్పీ రాధాకృష్ణ తెలిపారు.

కృష్ణా జిల్లాలోని కృష్ణలంక కానిస్టేబుల్ కిషోర్‌ను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల ముఠాతో చేతులు కలిపి ఆరు చోరీలకు పాల్పడినట్లు కిషోర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు 800 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి నగలును స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లాలోని ములుగు రోడ్డు సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం - ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. మృతులను హసన్‌పర్తి మండలం వంగపహాడ్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఎంబిబియస్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడ్ని నిర్మల్‌కు చెందిన మహ్మద్ అలీగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి, దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Congress leader from Uppal in the outskirts of Hyderabad Sridhar Reddy commited suicide. He is one of the accuded in a murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X